నాకు నీవే కదా ఆధారం – Neeve Adharam
నాకు నీవే కదా ఆధారం
నే నడిచేద నీతో నిత్యం
పల్లవి… నాకు నీవే కదా ఆధారం
నే నడిచేద నీతో నిత్యం
జాలిచుపవా నాపై /4/ నాకు /
చరణం : గాలివానలతో కలత చెందితిని
మంచి రోజులు నాకు రావనుకొంటిని /2/
నాపై జాలి పడిన ప్రభువా గొప్ప ధనస్సు గా వచ్చితివా /2/నాకు
చరణం : నిత్య మహిమకు నిలయుడవు నీవు
నీదు ఆత్మతో నన్ను నింపెదవు /2/
గుండె బరువెక్కి పోయిన వేళ
నీ మాట కదా ఆధారం /2/నాకు /
చరణం :నీవు లేకుంటే బ్రతుకలేనయ్యా
నీవు రాకుంటే నడువాలేనయ్యా /2/
మనసు ఓదార్పు నొందని వేళ
నీ ప్రేమే కదా ఆధారం /2/నాకు /

