Neeve Naa Aadharamu – నీవే నా ఆధారము-నీవేనాఆనందమూ

Faith Score+2
Faith Score+2

Neeve Naa Aadharamu – నీవే నా ఆధారము-నీవేనాఆనందమూ

నీవే నా ఆధారమూ – నీవే నా ఆనందమూ.
పల్లవి:- ఏ క్షణమైనా నా జీవితానా, ఏ క్షణమైనా నా జీవితాన…
అను పల్లవి:- నీవే నా ఆధారమూ… నీవే నా ఆనందమూ.
నీవే నా ఆధారమూ యేసయ్యా – నీవే నా ఆనందమూ…
వర్ణింప నా తరమా? నీ ప్రేమా…! – వివరింపగ సాధ్యమా? నీ కరుణ! వివరింపగా సాధ్యమా…!
చరణం.1. ఓ తల్లి బిడ్డను మరచునటా గానీ! – నీవు నన్నెప్పుడు మరువవటా!…||2||
నా అరచేతిలో చెక్కితి చూడనీ||2||
దక్షిణ హస్తము చాపే కదా!
తన దక్షిణ హస్తము చూపే కదా!
ఏ క్షణమైనా నా జీవితాన… ఏ క్షణమైనా నా జీవితాన,
నీవే నా ఆధారమూ – నీవే నా ఆనందమూ. నీవే నా ఆధారమూ యేసయ్యా నీవే నా ఆనందమూ…
చరణం.2. ఓ మనిషి మాటిచ్చి మరచునటా గానీ, నీ మాటలెన్నడు మారవటా! ||2||
సర్వము మాటతో పలికి సృజించిన||2|| సర్వజ్ఞుడవూ నీవే కదా!||2||
ఏ క్షణమైనా నా జీవితాన ||2||

నీవే నా ఆధారమూ – నీవే నా ఆనందమూ.
నీవే నా ఆధారమూ యేసయ్యా – నీవే నా ఆనందమూ…
చరణం.3. మంటికి మారే మనిషినటా గానీ! మహిమ పాత్రగా మలిచెనటా!||2||
మార్గములన్నిటా అడుగులు జారక||2|| దూతల కాపలా పంపే కదా! దేవ, దూతల కాపలా పంపు కదా!
ఏ క్షణమైనా నా జీవితాన ||2||

నీవే నా ఆధారమూ – నీవే నా ఆనందమూ.
నీవే నా ఆధారమూ యేసయ్యా – నీవే నా ఆనందమూ…
చరణం.4. కన్నీరు లేని రాజ్యమటా! అది కళ్యాణ శాశ్వత శోభనటా! ||2||
అర్హత లేని అన్య జనాంగమును! అర్హత అల్పులందరినీ! ఆ మహిమ రాజ్యము చేర్చు కదా ! ఆ మహిమ రాజ్యము చేర్చే కదా!
ఏ క్షణమైనా నా జీవితాన ||2||

నీవే నా ఆధారమూ – నీవే నా ఆనందమూ.
నీవే నా ఆధారమూ యేసయ్యా – నీవే నా ఆనందమూ…
వర్ణింప నా తరమా? నీ ప్రేమా! – వివరింపగా సాధ్యమా? నీ కరుణా! వివరింపగా సాధ్యమా!.

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo