Nenoppukondunu naa thappulanniyu – నేనొప్పుకొందును నా తప్పులన్నియు

Faith Score+3
Faith Score+3

Nenoppukondunu naa thappulanniyu – నేనొప్పుకొందును నా తప్పులన్నియు

నేనొప్పుకొందును నా తప్పులన్నియు నీ పాదాల చెంత యేసయ్యా [2]
దయా సాగరా-మన్నించి నా మొఱ
విడిపించు ఈ పాపపుచెర [2] నేనొప్పుకొందును [

దూరంగ నడిచాను – హీనంగ బ్రతికాను
తప్పు అని తెలిపిననూ – తప్పదనుకున్నాను [2]
వాక్యముతో గద్దించగా – గ్రహియించుకున్నాను
గతమంత తలచుకొని – చింతించుచున్నాను [2] [దయా సాగరా]

మలినమై యున్నపుడు – కరుణతో పిలిచావు
నీ సిలువ రక్తములో – దోషాన్ని కడిగావు [2]
ధూళినై యున్నానని – దూరంగ లేవయ్యా
జాలితో చేరదీసి – కౌగిలించావయ్యా [2] [దయా సాగరా]

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo