నేను పుట్టింది నా తండ్రి కొరకే – Nenu puttindi na tandri korake song lyrics
నేను పుట్టింది నా తండ్రి కొరకే
నేను బ్రతకాలి తన కీర్తి కొరకే
నేను చేయాలి ఆ తండ్రి పనులే
తిరిగి చేరాలి తానున్న స్థలమే
జగతికి ముందే ఏర్పరచి – గ్రంధపు చుట్టలో నను చేర్చి
పిండపు దశలో నను చూసి -కనుపాపవలె నను కాచీ…..
“నేను పుట్టింది “
సృష్టిలో ఉన్న సకలమును నాపై ప్రేమను తెలిపెనుగా
అనంత విశ్వంలో అన్ని తనను తెలుసుకోవాలనెగా (2)
రంగుల పూవులు తీయని కాయలు నా సంతోషం కొరకైతే
తెలిసిన నేను తెలియని వారికి దేవుని ప్రేమను తెలుపుటకే …
“నేను పుట్టింది”
నే తన మాటను వినను అని ముందే తండ్రికి తెలియునుగా
అందుకే క్రీస్తును నా కొరకే ఈ లోకమునకు పంపెనుగా (2)
నేనే మార్గము సత్యము జీవము అంటూ నన్నే మార్చేనుగా
మరువని త్యాగం చేసి నన్నే తండ్రికి చేరువ చేసేనుగా …
నేను పుట్టింది నా తండ్రి కొరకే
ఇకపై బ్రతికెదను తన కీర్తి కొరకే
ఇలలో చేసెదను నా తండ్రి పనులే
తిరిగి చేరెదను తానున్న స్థలమే
” జగతికి కి ముందే “
“నేను పుట్టింది”

