
Ona Snehama Lyrics – ఓ నా స్నేహమా
Ona Snehama Lyrics – ఓ నా స్నేహమా
ఓ నా స్నేహమా
ఎడబాయని బంధమా
ప్రేమజల్లులతో తడిపిన
నీలిమేఘమా
“నా కష్టకాలంలో అండగా
నిలిచే దైర్యమా” “2”
నలిగిన వేళలో
ఓదార్చే మధురగీతమా
“యేసయ్యా నా దైవమా
బ్రతికించే నా ప్రాణమా” “2”
” ఓ నా స్నేహమా ”
*1*.పువ్వులపై తేనెకోసమే
వాలతాయి తుమ్మెదలు
కలిమి కలిగివుంటేనే
చేరుతారు బంధువులు “2”
మార్పేరానియ్యవు
నీవు చూపే ప్రేమలో “2”
తోడుగా ఉన్నావు
నడచిన నా కష్టకాలంలో
ప్రతి సమయమున
దొరికేది నీ కరుణకనికరం..
” ఓ నా స్నేహమా ”
*2*.కోకిలమ్మ స్వరమును మాత్రమే
కోరుకుంటోంది లోకం
కనిపించే రూపము చూసి
చేయలేరు ఎవరు స్నేహం “2”
లక్షించవు నీవు
ఏ మనుష్యుల పైరూపం “2”
ప్రేమ పంచినావు
పరిశీలించి నా హృదయం
ఎన్నటికీ తెగిపోనిది
నీతో ఉన్న అనుబంధం..
” ఓ నా స్నేహమా ”