Orchuko Nerchuko Telugu Christian Worship Song Lyrics from John Mangacharyulu – ఓర్చుకో నేర్చుకో
పల్లవి:
ఓర్చుకో.. ఓర్చుకో.. అన్నీ నేర్చుకో.. నేర్చుకో
ఓర్చుకో.. ఓర్చుకో.. అన్నీ నేర్చుకో.. నేర్చుకో
ప్రేమతో పొరుగువారిని చేర్చుకో.. చేర్చుకో
నవ్వుతూ ప్రతి మనిషిని మార్చుకో.. మార్చుకో
చరణం 1:
చీమను చూచి ఆహారం సమకూర్పు నేర్చుకో
ఐక్యతతో ఆ ప్రయాణం నడవడం నేర్చుకో
కష్టపడుటలో ఆనందం పనిలో నేర్చుకో
కష్టపడితేనే ప్రతిఫలం వచ్చును చూచుకో
చరణం 2:
శ్రమలు వచ్చి నిన్ను చుట్టిన సహనము నేర్చుకో
ఇరుకులోనికి నెట్టిన నవ్వడం నేర్చుకో
అందరూ నిన్ను పొగిడిన అక్కడే మరచిపో
అందనంత ఎత్తెదిగిన ఒదగడం నేర్చుకో
చరణం 3:
ఓటమి తెచ్చిన పరాజయం పాఠం నేర్చుకో
కృంగిపోతే రాదు జయం ధైర్యం తెచ్చుకో
మనుషులు నిన్ను ముంచిన మోకాళ్ళు వేసుకో
మాటలతో నిన్ను గుచ్చిన చెవులను మూసుకో
Orchuko Nerchuko Lyrics in English
Orchuko Nerchuko Song Lyrics, ఓర్చుకో నేర్చుకో Lyrics
Key Takeaways
- The article presents the Telugu Christian worship song ‘Orchuko Nerchuko’ by John Mangacharyulu.
- The lyrics emphasize themes of learning, unity, and personal growth in a spiritual context.
- Each verse encourages listeners to embrace challenges, maintain perseverance, and acquire valuable life lessons.
- The song’s refrain urges the importance of love, connection with others, and fostering joy in every individual.
Estimated reading time: 2 minutes

