Palle Pallena Suvartha Telugu christian song lyrics from Spirits Protection పల్లెపల్లెనా సువార్త పనులే జరగాలి
”పల్లెపల్లెన సువార్త…” Our Musical Single
పల్లవి:
పల్లెపల్లెనా సువార్త పనులే జరగాలి
పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి (2)
ప్రజలందరూ ప్రభుని నమ్మాలి
పరలోకమే ఉన్నదని తెలియాలి
మరణించిన మనిషికి బ్రతుకు ఉందని
మహనీయులకు తెలియాలి
క్రీస్తు ద్వారానే స్వర్గముందని
ప్రతి మనిషి తెలుసుకోవాలి ”పల్లెపల్లెన”
చరణం 1 :
పెందలకడ నీవు లేచి
అందరితో నీవు కలిసి
క్రీస్తు మరణం పునరుత్థానం
ప్రకటించుచు పనులు చేస్తూ
అందమైన లోకముందని
ఆయుష్షు ప్రభుకై ఖర్చు చేసి
నిత్యజీవం పొందుకోనుమని
ప్రకటించుచు సాక్షర్థమై
క్రీస్తేసులా ప్రభునీ ఘనపరచి
జీవితంలోనా మాదిరి చూపి
నిందారహితుడవై క్రియలు చేయుచు
సత్యముగా బ్రతకాలి
ఎదుటి వారికి మేలు చేయుచు
కీడు చేయక బ్రతకాలి ”పల్లెపల్లెన”
చరణం 2 :
గొప్ప గొప్ప సభలు చేసి
వేల మందిని కూర్చోబెట్టి
తండ్రి ప్రేమను తెలియచేసి
మనిషి ప్రేమ చిన్నదనియు
మనసులోన ఉన్న మలినం
వాక్యముతో పారద్రోలి
మాయలోకం మనదికాదని
మంచి అంటే వాక్యమేనని
పేతురు, పౌలులా వాక్యము తెలిపి
వాస్తవమైనా జీవితం ఉందని
సందేహములో ఉన్నవారిని
సత్యములో నడపాలి
అగ్నిలో నుండి రక్షించే
ఆదరణ నీవు చూపాలి ”పల్లెపల్లెన”
Song Title: Palle Pallena Suvartha
Lyrics & Tunes: Br. Srinivas Garu ( SIDDIPET )
Music: Br. Prashanth Penumaka
Vocals: Symon Victor
Adajanmanu Devudenduku Chesadu
Kalam Netho Agadhu
Tharamulu Maruchunnavi
Sandram Lo Padava Prayanam
Marachipoleni Mahilal
Evariki Raledu Kresthulo Badalu
Alpakalamu Papabhogamu
#PallePallenaSuvarthaTrack
#teluguchristiansongs #spiritsprotectionsongs #jesussongstelugu #latestteluguchristiansongs #latestchristiansongs #teluguchristiansongs2022 #teluguchristiansongslatest
Key Takeaways
- The article shares the lyrics of the Telugu Christian song ‘Palle Pallena Suvartha’.
- It emphasizes the importance of faith in Christ and the concept of eternal life.
- The lyrics discuss themes like community, love, and the teachings of Jesus.
- Musical details include the contribution of Br. Srinivas Garu for lyrics and tunes, and Symon Victor for vocals.
- The song aims to inspire listeners about the significance of Christ’s resurrection and the Christian faith.


