ప్రతీక్షణం ప్రత్యేకంగా – Prathikshanam pratyekanga

Faith Score+1
Faith Score+1

ప్రతీక్షణం ప్రత్యేకంగా – Prathikshanam pratyekanga

ప్రతీక్షణం ప్రత్యేకంగా
యేసయ్యే నీతో ఉండగా
భయపడతావు ఎందుకు? (2)
యెహోవా యీరే నిన్ను చూచును
యెహోవా రాఫా స్వస్థపరచును
దిగులేల ఓ మనసా! ||ప్రతీక్షణం||

1) వేదన నిరాశలతో జీవించితిని
అపజయాల నిందలతో శిధిలమైతిని (2)
నా ఆధారం నీవే
నా ఆశ్రయం నీవే (2)
నీ ప్రియ బిడ్డగా
నన్ను చేర్చుకొనుమయ్యా ||యెహోవా యీరే||

2) బ్రతుకు భారం మోయలేక మౌనినైతిని
దిక్కు దారి ఆదరణ లేకయుంటిని (2)
కృంగిపోయిన నన్ను
లేవనెత్తువాడవు నీవే (2)
నా యందు కృప చూపి
కనికరించు కరుణామయా ||యెహోవా యీరే||

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo