Prema gala thandri – ప్రేమగల తండ్రి

Faith Score+13
Faith Score+13

Prema gala thandri – ప్రేమగల తండ్రి

ప్రేమగల తండ్రి కృప గల యేసు
దయగల ఆత్మ నీకే స్తోత్రము
నాయందు జాలిపడు దేవా
నానీతివైన నా ప్రభువా

నా కృప వీడిపోదంటివే
నా నిబంధన తొలగదంటివే

1.అరచేతిలో చెక్కుకున్న నంటివే
నా చేతిలో నక్షత్రం అంటివే
నీ చేతిలో నిత్య సుఖములుండగా
ఆ కరుణ హస్తమే నాకు చాలయ్యా

2.నిందలను రెట్టింపు ఘనతగా
బాధలను మరచిన కలగా
దుఃఖమునే నాట్యముగా మార్చి
బూడిదకే అందాన్ని ఇయ్యవా

  1. నా కొరకు ఎదురు చూసిన ప్రేమా
    నా కడకు పరుగెత్తిన ప్రేమా
    నా మీదపడి ముద్దాడినా
    నీ కౌగిళిలో జీవింతును

4.నా వలన నష్టమే కలిగినా
అవమానమునే కలిగించినా
నే కోల్పోయినవన్నీ నాకిచ్చీ
విందుచేసి మంచి సాక్షమిచ్చావా

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo