Prema Yesuni Prema Adi Evvaru Koluvalenidi – ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది

Faith Score0
Faith Score0

Prema Yesuni Prema Adi Evvaru Koluvalenidi – ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది

ప్రేమ యేసుని ప్రేమ – అది ఎవ్వరు కొలువలేనిది
నిజము దీనిని నమ్ము – ఇది భువి యందించలేనిది
ఎన్నడెన్నడు మారనిది – నా యేసుని దివ్య ప్రేమ
ఎన్నడెన్నడు వీడనది – నా యేసుని నిత్య ప్రేమ

తల్లితండ్రుల ప్రేమ – నీడవలె గతియించును
కన్నబిడ్డల ప్రేమ – కలలా కరిగిపోవును

భార్యభర్తల మధ్య – వికసించిన ప్రేమ పుష్పము
వాడిపోయి రాలును త్వరలో-మోడులా మిగిలిపోవును

బంధుమిత్రుల యందు – వెలుగుచున్న ప్రేమ దీపము
నూనె ఉన్నంత కాలమే – వెలుగునిచ్చి ఆరిపోవును

ధరలోని ప్రేమలన్నియు – స్థిరము కాదు కరిగిపోవును
క్రీస్తు యేసు కల్వరి ప్రేమ – కడవరకు ఆదరించును

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo