స్తుతించకుండా నేను ఉండలేనయ్య – Sthutincakunda nenu undalenayya lyrics
స్తుతించకుండా నేను ఉండలేనయ్య
నన్నింతగా బలపరచినందున
ఆరాధింపక నేనుండలేనయ్య
నాకిన్ని మేలులు దయ చేసినందున
మహోన్నతుడా మహిమ స్వరూ పుడా
స్తుతికి పాత్రు డా పూజార్హుడా
విశ్వపాలకుడా నా యేసయ్య
1. మండు టెండలో మేఘ స్తంభమై
కారు చీకటిలో కాంతి పుoజ మై
నడిపించినావు నా బ్రతుకు దినాలలో
కురిపించినావు నీ కృపను
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
2.వేలాది దూతలకు బహు ఘనుడవై
శుద్ధు లందరి విజయ నాదమై
జ్వలించుచున్నావు సీయోను కొండపై
నిలిచి ఉన్నావు విశ్వవిజేతవై
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
3. సంఘమునకు నీవే శిరస్సు
ప్రతి అవయవమునకు పోషకుడవు
ఐక్యపరిచావు ఏక శరీరముగా
స్థిరపరచుము సమాధాన భంధముతో
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
ఆరాధన నీకే ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన


