Tvaraga Ranunna Yesu Tvaragane Rammu Thandri – త్వరగా రానున్న యేసు

Faith Score+2
Faith Score+2

Tvaraga Ranunna Yesu Tvaragane Rammu Thandri – త్వరగా రానున్న యేసు

త్వరగా రానున్న యేసు తర్వగానే రమ్ము తండ్రి
త్వరగా వచ్చు ప్రభువా చురుకు
తనమిమ్ము నే త్వరపడగలను || త్వరగా ||

నేనిక సిద్ధంబుగా లేనని తెలిసినది నిరుకు
గానన్ పరిశుద్ధాత్మయే నన్ను
కడకు సిద్ధము జేసికొనును || త్వరగా ||

రాకడ సామీప్యమన్న లోకము హేళనచేయు
లోకముతో నీ సంఘము కూడ
ఏకమాయెను ఏమి చేతును || త్వరగా ||

ప్రతివాని మతికి రాకడ ధ్వని వినిపించుమో రాజ
క్షితినిమిత్త మిదియె ప్రార్ధన
స్తుతి చేతును నీ కనుదినంబును || త్వరగా ||

విశ్వాసులె నేటి రాకడ విశ్వసింపరంచు జెప్పి
విశ్వాసము పోగొట్టుకొనక
విశ్వాసముచే పట్టుకొందును || త్వరగా ||

ప్రభువైన యేసు రమ్మను ప్రార్ధన నేర్పుమో ప్రభువా
సభలకు మాత్రమే కాక ఇతర
జనులకు కూడనిదియె ప్రార్ధన || త్వరగా ||

రాకడనమ్మిక అరిగి పోకముందె రమ్ము తండ్రీ
రాకడకు సిద్ధము గాకున్న
లోకము హేళన చేయక మానదు || త్వరగా ||

జనక సుతాత్మలకు స్తుతులు సంఘ వధువు వల్ల భువిని
మనుసున స్తుతికార్యము తప్ప మరి
పనియేమున్నది భక్త జనాళికి || త్వరగా ||

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo