Viduvani edabayani devuda yesayya – విడువని ఎడబాయని దేవుడ యేసయ్యా

Faith Score0
Faith Score0

Viduvani edabayani devuda yesayya – విడువని ఎడబాయని దేవుడ యేసయ్యా

పల్లవి:
విడువని యెడబాయని దేవుడా యేసయ్యా
కంటి రెప్ప వోలే కాపాడుచున్నావయ్యా #2#
అను పల్లవి:
నీ కృపయే నన్ను కాచెను
నా జీవితమును ఆశీర్వదించెను #2#
నా జీవితమును ఆశీర్వదించెను…

  1. నిలిచిన ప్రతి స్థలమందు నాతోడై యుండి
    ఘనమైన కార్యములు జరిగించినావు
    ఇరుకైన మార్గములో విశాలతను ఇచ్చి
    ఎక్కలేని కొండకు నన్ను ఎక్కించినావు #2#
    నీ కృపయే నన్ను కాచెను
    నా జీవితమును ఆశీర్వదించెను #2#
    నా జీవితమును ఆశీర్వదించెను…
  2. కృంగిన నా జీవితమును తిరిగి లేవనెత్తిన
    మహాదేవుడా నా యేసయ్యా
    నా ప్రతి ప్రార్ధనకు నీవు చెవియొగ్గి
    నాకెన్నో మేలులు చేసినావయ్యా #2#
    నీ కృపయే నన్ను కాచెను
    నా జీవితమును ఆశీర్వదించెను #2#
    నా జీవితమును ఆశీర్వదించెను…
  3. చిరకాలము నీ సన్నిధిలో
    గడిపే కృపాభాగ్యము నాకిచ్చినావు
    కలకాలము నీ కౌగిలిలో
    యెదిగే కృప ధన్యత నాకొసగినావు #2#
    నీ కృపయే నన్ను కాచెను
    నా జీవితమును ఆశీర్వదించెను #2#
    నా జీవితమును ఆశీర్వదించెను…

Viduvani edabayani devuda yesayya telugu christian song lyrics

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo