Yehova Chetha Aasirvadincha badinavada – యెహోవాచేత ఆశీర్వదించ
యెహోవాచేత ఆశీర్వదించ
బడినవాడా లోపలికిరావా
దేవుని రక్షణ ఓడ లోపల రక్షింపబడే నోవహు
దేవుని మాట వినక వెలుపల ఆ ఆ
వెలుపల నున్న ప్రజలు
తినుచు త్రాగుచు పాపములోపడి
నశియించిరి జల ప్రళయములో
పెండ్లి విందుకు రాజు పిలువగా
సాకులు చెప్పిరి కొందరు
లోపలనున్నవారు విందులో పాల్గొన్నారు
పెండ్లి వస్త్రము లేని ఒకనిని
త్రోసిరి వెలుపల చీకటిలో
గవినివెలుపల సిలువలో యేసు
మనలను బ్రతికింప మరణించే
లోపల నిత్యజీవము
వెలుపల నిత్యనరకం ఆ… ఆ….
యేసుని నమ్మి రక్షణ పొంది
జీవములో చేర రమ్ము ప్రియుడా

