యెహోవా మా దేవ – Yehovah Ma Deva
యెహోవా మా దేవ – సర్వలోక దైవమా
యుగ యుగములు నీవే మా ఏక దేవుడవు
తరతరములకు నీవే మా ఏక దైవము (2)
హల్లెలూయ – హల్లెలూయ (2)
|| యెహోవా మా దేవ ||
1. అబ్రహాము ఇస్సాకుల దేవుడనని సెలవిచ్చితివి
యాకోబు యోసేపులను దీవించి నడిపించితివి(2)
ఈనాటి ఈ మా తరమును
చేయివిడువక నడిపించుమయ (2)
|| యెహోవా మా దేవ ||
2. మోషే యెహోషువలన్ స్వరమెత్తి పిలచితివి
ఏలీయా ఏలిషలను అగ్ని జ్వాలాగా చేసితివి(2)
ఈనాటి ఈ మా తరమును
అగ్ని కణముగా చేయుమయ (2)
|| యెహోవా మా దేవ ||

