యేసు రక్తమే క్షమించమని – Yesu Raktame Ksamincamani Morapedutundi song lyrics

Faith Score0
Faith Score0

యేసు రక్తమే క్షమించమని – Yesu Raktame Ksamincamani Morapedutundi song lyrics

పల్లవి:

యేసు రక్తమే క్షమించమని మొఱపెడుతుందీ
హేబేలు రక్తమే శిక్షించమని మొఱపెడుతుందీ
హతులైన నీతిమంతుల ఈ రక్తమంతా
ప్రతి దండన చెయ్యాలనీ కోరుతుంటే
ఎవరి రక్తమో శ్రేష్టమైనది…
ఎవరి రక్తమో క్షమించమన్నది….
యేసు రక్తమే ఈ భువిలో
శత్రువులనైనా క్షమించమని అడుగుతుంది
ప్రతి మనుష్యుల ప్రతి పాపాన్ని కడుగుతుంది

“‘యేసు రక్తమే””

1 చరణం:

అన్నే నన్ను చంపాడని నిలదీయగా
ఆ దేవుడు వదలలేదుగా
ప్రతికారం తీర్చాలని మొఱపెట్టగా
కయ్యీనునె వదలలేదుగా
మృతులైనవారే క్షమించలేదు
పరదైసుకు వెళ్ళినా వదలలేదు
యేసు రక్తమే ఈ భువిలో
శత్రువులనైన క్షమించమని అడుగుతుంది

“‘యేసు రక్తమే””

2 చరణం:

సైఫెనును రాళ్ళతో కొట్టి చంపుతుండగా
న్యాయము తీర్చాలని అతనడగలేదుగా
సైఫెనును చంపితే సౌలే సమ్మతించగా…
ఆ యేసే పిలిచి మరి రక్షించెను
యేసు ప్రేమ ఇతరులకు ప్రకటించవా…
నిను చంపుతున్న వారి కొరకు ప్రార్థించవా…
ఆ యేసును ఈ రోజే నువు నమ్మితే
క్షమించమని యేసొకడే నేర్పుతాడు
అందుకే సర్వాధికారమిచ్చాడు

“‘యేసు రక్తమే””

3 చరణం:

హేబేలు కంటె శ్రేష్టమైన యేసు నొద్దకే
క్రొత్త నిబంధన యొద్దకు మీరొచ్చారు
హేబేలు వలే అడగకుండా ఉండాలనే
సైఫెను క్రొత్త నిబంధనలో నేర్పించాడు
ఎన్ని మార్లు సహోదరుని క్షమించాలి…
డెబ్బై ఏళ్ళకు పైనే క్షమించాలి….
ఈ రక్తమే ప్రతిసారి నువు త్రాగుతుంటే
క్షమించమని అడుగుతుంది
ఆరాధనలో క్షమాపణ దొరుకుతుంది

“‘యేసు రక్తమే””

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo