Yesuni Chenthaku Aasatho Rammila Doshamul Bapunaya – యేసుని చెంతకు ఆశతో రమ్మిల దోషముల్
యేసుని చెంతకు ఆశతో రమ్మిల దోషముల్ బాపునయా
ఇదియే మిక్కిలి అనుకూల సమయము ఇదె రక్షణ దినము
ఇపుడే యేసుని ఎదలో నమ్మిన యిదె రక్షణ దినము
జపములు తపములు ఉపవాసములు పాపముల్ బాపవయా
దానధర్మములు తీర్ధయాత్రలు పాపముల్ బాపవయా
యేసుని రక్తమే పాపము శాపము ఇపుడే బాపునయా
పాపుల కొరకై మన ప్రభుయేసు ప్రాణము బెట్టెనయా
మృతుడై లేచెను పరమునకేగెను ధర కేతెంచునయా
స్థిరమని నమ్మిన వారికి పరమానందము దొరుకునయా
యేసుని నామము పావన నామము దోషముల్ బాపునయా
ఈ శుభవార్త ఈ జగమంతా ఇపుడే చాటెదము
తరుణము దాటిన మరియిక రాదు నరకము తప్పదయా


