జీవింతును నీలో – Jevinthunu Nelo Lyrics

Faith Score0
Faith Score0

జీవింతును నీలో – Jevinthunu Nelo Lyrics

పల్లవి: నీ సన్నిదే చాలు నీ కౌగిలే మేలు
నే కోరను ఇలలోనిది ఆశించను క్షయమైనది

అ//ప: జీవింతును నీలో జీవింతును నీలో జీవింతును నీలో

1చ. నీలో నిలచి నివసింతును నీతో నడచి సాగిపోదును. నీలో నాటబడి ఫలియింతును నీచే దీవించబడి తృప్తిపడెదను //2//
ధ్యానింతును నిన్నే ప్రతిక్షణము
స్తుతియింతును నిన్నే అనుదినము //2//

వ్యాధి అయినను బాధ అయినను దుఃఖమైనను ఉపద్రవమైనను
నేనేమైనాను!!!! అ//ప:

2చ. నీ సువార్త ప్రకటింప శక్తినివ్వుమా నీ ప్రేమను వివరింప మనసునివ్వమా
శ్రమలైనను బరియింప కృపనివ్వుమా ప్రాణమైన అర్పించ భాగ్యమివ్వుమా//2//
ప్రకటింతును నీ కృపా వాక్కును
వివరింతును నీ ప్రేమ సువార్తను//2//

కరువైనను ఖడ్గమైనను శ్రమలైనను హింసైనను
నేనేమైనాను!! అ//ప:

 

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo