తృప్తి లేని జీవితమే శాపకారమయ్యా – Telugu Christian Songs lyrics Bro. Saahus Prince
దేవునికి మహిమ కలుగునుగాక
పల్లవి
తృప్తి లేని జీవితమే శపకారమయా
సంతృష్టి సహితమే క్షేమకరమయా..2
కలిగున్నా దానిలో హాయివుందయా..2
లేనిపోని కొరికలో హనివుందయా..2
//తృప్తి లే// ..2
చరణం
నీ కన్నా పై వారితో పోల్చుకోకయా ఏ చెట్టుకు అంతేగాలి తెలుసుకోవయా..2
దూరపు కొండలు నునుపేనాయా..1
భవిత సత్య మదిగో (గ్రహించుమయా)..3
//తృప్తి//..1
చరణం
డబ్బుంటే అంతే చాలు అనుకోకయా దాని నీడలోన సమస్త కీడు దాగివుందయా..2
పోయేటప్పుడేది నీతో రాదయ్యా..2
బైబిల్ సత్య మదిగో (తెలుసుకోవయ్యా)..3
పల్లవి
తృప్తి లేని జీవితమే శపకారమయా
సంతృష్టి సహితమే క్షేమకరమయా..2
కలిగున్నా దానిలో హాయివుందయా..2
లేనిపోని కొరికలో హనివుందయా..2


