మందిరములోనికి రారండి – mandiramu loniki Jesus telugu songs

Faith Score+1
Faith Score+1

మందిరములోనికి రారండి – mandiramu loniki Jesus telugu songs  mandiramu lonik

మందిరములోనికి రారండి
వందనీయుడేసుని చేరండి (2)
కలవరమైనా కలతలు ఉన్నా (2)
తొలగిపోవును ఆలయాన చేరను
కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను ||మందిరము||

దేవుని తేజస్సు నిలిచే స్థలమిది
క్షేమము కలిగించు ఆశ్రయ పురమిది (2)
వెంటాడే భయములైనా
వీడని అపజయములైనా (2) ||తొలగిపోవును||

సత్యము భోదించు దేవుని బడి ఇది
ప్రేమను చాటించు మమతల గుడి ఇది (2)
శ్రమల వలన చింతలైనా
శత్రువుతో చిక్కులైనా (2) ||తొలగిపోవును||

శాంతి ప్రసాదించు దీవెన గృహమిది
స్వస్థత కలిగించు అమృత జలనిధి (2)
కుదుటపడని రోగమైనా
ఎదను తొలిచే వేదనైనా (2) ||తొలగిపోవును||

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo