ఆకారములో చిన్నవి చీమలు – Akaramlo cinnavi cimalu
ఆకారములో చిన్నవి చీమలు
బ్రతుకుట లో బహు జ్ఞానులు
చెప్పేవారు లేకున్నా క్రమము తప్పని జీవులు
నడిపించేవారు లేకున్నా నడక తప్పని ప్రాణులు
“సోమరీ రా మరి చీమల యొద్దకు
దేవునిలో నీతిగా నీ బ్రతుకే సాగుటకు” ఆకారములో”
బలమైనా సర్పమునైనా ఐక్యతతో అవి చంపును
కలిసి ఉంటే ఎంత మేలో పాఠమునే అవి నేర్పును…
సాతానుని ఎదిరించే క్రైస్తవులారా…
సర్వాంగ కవచమును మీరు ధరియించినారా
చీమలను చూసైనా ఐక్యత నేర్చుకోరా “ఆకారములో”
క్రమమును నేర్పించే కాపరి మనకున్నను …
దివ్యమైన.. వాక్యములను దేవుడు మనకిచ్చిన…
నడకను మాత్రమే నేర్చిన ఓ ప్రియులారా
నడవడికను నేర్వాలని మరచినారా…
చీమలను చూసైనా క్రమమును నేర్చుకోరా… “ఆకారములో”

