రాజాధిరాజ రవి కోటి తేజ – Raajadi Raja Ravikoti Teja song lyrics

Faith Score+1
Faith Score+1

రాజాధిరాజ రవి కోటి తేజ – Raajadi Raja Ravikoti Teja song lyrics

రాజాధిరాజ రవి కోటి తేజ
రమణీయ సామ్రాజ్య పరిపాలకా } 2
విడువని కృప నాలో స్థాపించేనే
సీయోనులో నున్న స్తుతుల సింహాసనమును } 2|| రాజాధి రాజా ||

వర్ణనకందని పరిపూర్ణమైన నీ
మహిమ స్వరూపమును నాకొరకే త్యాగముచేసి } 2
కృపాసత్యములతో కాపాడుచున్నావు
దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించేద } 2|| రాజాధి రాజా ||

ఊహలకందని ఉన్నతమైన నీ
ఉద్దేశ్యములను నా యెడల సఫల పరిచి } 2
ఊరేగించుచున్నావు విజయోత్సవముతో
యేసయ్య నీకన్న తోడెవ్వరులేరు ఈ ధరనిలో|| రాజాధి రాజా ||
మకుటము ధరించిన మహారాజువై నీ
సౌభాగ్యమును నా కొరకై సిద్ధపరచితివి } 2
నీ పరిశుద్ధమైన మార్గములో నడిచి
నీ సాక్షినై కాంక్షతో పాడెద స్తోత్ర సంకీర్తనలే } 2|| రాజాధి రాజా |

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo