బ్రతికెదను నేను నీ కోసమే – Brathikedanu nenu nee kosame
పల్లవి-బ్రతికెదను నేను నీ కోసమే
చావైతే లాభమే యేసయ్యా
చావైతే లాభమే
యేసుని గూర్చిన వార్తను చాటుటకు
ముందుకు సాగిపోదును నేను
ముందుకు సాగిపోదును
1- ఆస్తులు పోయిన ఆప్తులు విడిచిన యోబు వలే నేను స్తుతియించెదా
లోకపు శ్రమలు నను వెంటాడిన
స్తెఫను వలే నేను కొనసాగెదా
నా సొంత జనులే అవమానించినా
దేవా నిన్నే ప్రకటించెదా
2- శత్రువులే నను వెంటాడిన
మోషే వలే నేను కొనసాగెదా
క్రీస్తుకు సాక్షిగా రక్తము చిందిన
పౌలు వలే నేను కొనసాగెదా
నమ్మిన వారే నిందలు మోపిన
దేవా నిన్నే ప్రకటించెదా

