Dinadayaluda Yesa Ni Dasuni Prardhana Vinuma – దీనదయాళుడ యేసా

Faith Score0
Faith Score0

Dinadayaluda Yesa Ni Dasuni Prardhana Vinuma – దీనదయాళుడ యేసా

దీనదయాళుడ యేసా
నీ దాసుని ప్రార్ధన వినుమా
దేవా యేసయ్యా
నా ఆర్తధ్వని వినుమయ్యా || దేవా ||

తల్లిగర్భమున మొదలుకొని
నన్నాదుకొన్నది నీవెగదా
సహాయకులెవ్వరు లేరిలలో
నీవేల దూరము నున్నావు || దేవా ||

అడుగుడి మీకివ్వబడున్
వెదకండి మీకు దొరుకునని
ప్రతివాడు అడిగి పొందునని
అభయమ్ము నిచ్చిన యేసయ్యా || దేవా ||

విడువను యెడబాయనని
వాగ్ధానమిచ్చిన నా యేసా
స్తోత్రించెదన్ సమాజములో
సేవించెదన్ నీ నామమునే || దేవా ||

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo