Kalam Netho Agadhu Telugu christian song lyrics – కాలం నీతోఆగదు సమయం

Faith Score+2
Faith Score+2

Kalam Netho Agadhu Telugu christian song lyrics – కాలం నీతోఆగదు సమయం spirits protection

పల్లవి :
కాలం నీతోఆగదు సమయం నీతో ఉండదు
కాలం నీతో ఆగదు సమయం నీతోనే ఉండదు
పరుగులు తీస్తుంది ఉరకలు వేస్తుంది
దేవుడు చెప్పిన ఆజ్ఞను పాటిస్తూ ఉంది
సోమరి ఎందాక ఉరుకుందువు
కాలమే పరుగులు తీయగా ఉరకలు వేయగా
కాలం నీతో ఆగదు సమయం నీతోనే ఉండదు

చరణం 1:
కాలాన్ని వృధాగా గడిపిన వారు ఎందరో
అజ్ఞానులుగా చరిత్రహీనులయారు
దినములను దేవునికివ్వనివారు ఎందరో
సంఘములో నుండి తుడిచి వేయబడ్డారు
దేవునికై పుట్టిన నీవు, దేవుని పని చేయాలి
సమయమును వృధాగా గడపక,సద్వినియోగించాలి
అంధకార క్రియలను విడిచి క్రీస్తునుధరించాలి
పైనున్న వాటిని వెతికి పరలోకం చేరాలి
కాలమునెరిగి నిద్ర మేలుకొని
సమయం అయినది అని తెలుసుకోవాలి ” సోమరి”

చరణం 2:
సమయమును దేవునికిచ్చిన వారు ఎందరో,
సత్యములోనే నిలిచిపోయారు
ప్రాణాలను దేవునికిచ్చిన వారు ఎందరో
పరిశుద్ధులుగా ప్రసంగాల్లో నిలిచారు
తిరస్కార కొరడాదెబ్బలు బంధకములు అనుభవించిరి.
అడవులలో కొండలలోనూ గుహలలో నా తిరుగు లాడిరి
శోధింప బడినవారు ఖడ్గముతో చంపాబడిరి
సమయమనక అసమయమనక
ప్రభు పనిలో ప్రయాసపడిరి,
అలుపెరుగని పోరాటం చేసి
ఆయుష్కాలం ముగించుకొనిరి.. “సోమరి”

Adajanmanu Devudenduku Chesadu
Tharamulu Maruchunnavi
Sandram Lo Padava Prayanam
Marachipoleni Mahilalu
Evariki Raledu Kresthulo Badalu
Alpakalamu Papabhogamu

#KalamNethoAgadhu
#teluguchristiansongs
#spiritsprotection
#latestchristiansongs #SpiritsProtectionSongs #latestteluguchristiansongs #teluguchristiansongs2022 #teluguchristiansongslatest
#SpiritsProtectionsongs
​​#teluguchristiansongs
#latestteluguchristiansongs
#SpiritsProtectionsongs
#SpiritsProtection

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo