![tamil christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/11/tamil-christian-songs-lyrics-150x150.png)
Marachipoleni Mahilalu – మరచిపోలేని మహిళలు
Marachipoleni Mahilalu – మరచిపోలేని మహిళలు
Lyrics :-
మరచిపోలేని మహిళలు… మరపురాని మహానీయులు… ” 2”
సత్ క్రియల చేత అలంకారముగా నిలిచిపోయినారు…
సాధువైనట్టి, మృదువైనట్టి… గుణమను అక్షయఅలంకారము
హృదయమున అంతరంగస్వభావం ధరించినారు…
పరిశుద్ధగ్రంధములో…నిలిచినవారు…
స్ఫూర్తికారులు…పరిశుద్ధస్తీలు…
ప్రపంచ మహిళలకు… మాదిరివారు… ”2” – మరచిపోలేని
1.భర్తకులోబడినా భార్య శారాయి…
యజమానుడని పిలుచుచూ… లోబడియుండెనుగా…
భర్త చనిపోయినా బంధువులను విడచి…
అత్తతో పయనించి క్రీస్తు వంశాళిలొ నిలిచెను రూతు
ఘనురాలైనా…షునేమీయురాలు….ఆధిత్యము చేసి…
ఎలిషాతొ ఆశీర్వాదం పొందెను…
వేగులవారిని చేర్చుకొని వేరొకదారిన పంపి
క్రియల ద్వారా నిరూపించెను రాహబను వేశ్య
వారి అడుగు జాడల్లో నడిచినా శారాకు సంతానమౌతారు “2” – మరచిపోలేని☆
2.వాక్యం వింటున్నా… నేటికైరైస్తవులైన స్త్రీలు
పరిశుద్ధస్త్రీల గూర్చివిని బ్రతకడం లేదుగా…
లేని వార్తను పుట్టించి సంఘంలో అల్లరి సృష్టించి
మంచిని చెడుగా చేసి సంఘాన్ని కూల్చుతున్నారుగా
జడలు అల్లుటయు…బంగారు,నగలు ధరియించుటయు
పైరూపము మాత్రము కాక ప్రవర్తనా అలంకారముగా…
పూర్వమందున్న దేవుని ఆశ్రయించినా స్త్రీలు
సత్ ప్రవర్తన చేత హృదయాన్ని అలంకరించుకున్నారు
వారి క్రియలను మీరు చేసినా ప్రియమైన పిల్లలు అవుతారు “2”
☆మరచిపోలేని