Maruvani Yesayya song lyrics – మరువని యేసయ్యా

Faith Score+1
Faith Score+1

Maruvani Yesayya song lyrics – మరువని యేసయ్యా

పల్లవి : తల్లి మరిచిన తండ్రి విడిచిన
మరువని యేసయ్య
నా ప్రాణము నీవయ్యా
నన్ను విడువని దేవుడవు
ఎడబాయని దేవుడు

అ : స్తుతియింతును – ఆరాధింతును ఘనపరుతును యేసయ్య
నిన్నే ఘన పరుతులు యేసయ్య

చరణం : ఆదరించి ఆదుకున్నావు
ప్రేమ చూపి పిలచుకున్నావు
నా పాప బ్రతుకును తుడిచి వేశావు
పరిశుద్ధునిగా నన్ను మార్చావు

అ : స్తుతియింతును ఆరాధింతును ప్రేమించేదను యేసయ్య నిన్నే ప్రేమించేదను యేసయ్య

చరణం : ఒంటరినై నేను మూల్గుచుండగా తోడుగా ఉన్నావు
నా నీడగా నిలిచావు
శ్రమలో నేను కృంగి ఉండగా
నా చెంతకు చేరావు
నా చింతను తీర్చావు

అ : స్తుతియింతును ఆరాధింతును ప్రకటించెదను యేసయ్య నిన్నే ప్రకటించెదను యేసయ్య

చరణం : చీకటి బ్రతుకు వెలిగించి సంతోషమిచ్చావు సంతృప్తినిచ్చావు మరణస్థితిని చూచి నీవు జీవమునిచ్చావు
నాకు బ్రతుకునిచ్చావు

అ : స్తుతియింతును ఆరాధింతును సాక్షిగా నిలిచేదను నీ సాక్షిగా బ్రతికేదను

Maruvani Yesayya Telugu christian song lyrics

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo