Nee Krupa Kanikaramu – నీ కృపాకనికరము
నీ కృపకనికరము ఆ కల్వరిలో కనపరిచినావు
నీ ప్రేమ జాలియు నా స్థితి పై చుపించినావు ||2||
నీకే నా ఆరాధన – స్తుతి ఆరాధన నీకే ||2||
||నీ కృపకనికరము||
1.నీ ప్రేమను మరచి దూరమైతిని దేవా
ఒంటరినై నేను తిరిగి వచ్చితిన్ ||2||
నీ చేతులు చాపి కౌగలించితివి ప్రభువా
నన్ను పట్టి ముద్దు పెట్టి చేర్చుకొంటివి
యోగ్యతే లేని నాపై కనికరింతివి ప్రభువా
నీదు నన్ను యోగ్యునిగా చేసితివి ||నీకే నా ఆరాధన||
2.నా దుఃఖ కన్నీటితో ప్రార్థించితిని దేవా
ఓదార్పు లేని నాకు తండ్రివైతివి ||2||
నా ఆలోచనలన్ని యెరిగియుంటివి ప్రభువా
నా ఆశలన్నియు తీర్చితివి
విరిగిన మనస్సే నీకిష్టమైయున్నది
సజీవయాగముగా సమర్పింతును ||నీకే నా ఆరాధన||
3.నాకున్న బలముతో పోరాడితిని దేవా
ఓడి పోయే నన్ను నీవు గెలిపించితివి ||2||
నీ అధికశక్తి చేత అతిశయించితిని ప్రభువా
నాకు ఇచ్చిన విజయం నీదే గదా
నా శక్తిచేత కాదు నీ ఆత్మతోనే ప్రభువా
నాకున్నవన్నియు నీవే గదా ||నీకే నా ఆరాధన||

