నీ ప్రేమ గీతము – Nee prema geethamu

Faith Score+1
Faith Score+1

నీ ప్రేమ గీతము – Nee prema geethamu

పల్లవి: నీ ప్రేమ గీతమూ నే పాడుకుందును
నీ గొప్ప కార్యముల్ నే వివరించెదను
ఇహ పరములయందు నీవే నా దేవుడవు
ఆదియంతమూ లేని అమరుడైన నా ప్రభు

అష॥ నీలా నను ప్రేమించేదవరూ
నీలా నను క్షమియించేదవరూ
నీలా నను ఇల వెదకేదెవరూ
నీలా నను సరి చేసేదెవరూ
నీ ప్రేమ గొప్పదయా, నీ ప్రేమ మారదయా
నీ ప్రేమను చూపించి, నీ ప్రేమలో నిలిపితివి

1. పాపినని తెలిసి కూడా నన్ను ప్రేమించావు
నా పాపమంత మోసి నాకై బలియైనావు ||
నాకు బదులు మరణించి నిత్యజీవమిచ్చావు
నన్ను నీవు విడుంకుండా నాకు తోడైయున్నావు ॥2॥ ॥నీలా॥

2. మంచి సమరయుడవై నన్ను ఆదరించినావు.
నీతి మార్గమందు నడిపి నా కాపరిగ మారావు
నాకై గాయములు పొంది నన్ను స్వస్థపరచావు.
నీదు ఆత్మతో నను నింపి నాకు తండ్రివైనావు ॥2॥ ॥నీలా॥

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo