నీ స్తుతి పాత్రనై పాడెద వేనోళ్ళతో – Nee Sthuthipatranai Padeda
నీ స్తుతి పాత్రనై పాడెద వేనోళ్ళతో యేసయ్య
నీ స్తుతియాగమే చేసెద నీ సముఖాన నా యేసయ్య
నిన్నేంత ఘనపరచిన నిన్నెంత నే పొగడిన
నా తనివి తీరదే నీ ఋణము తీరదే
(నీ ఆరాధనే నా ఆనందము
నీ సంకీర్తనే నా సంతోషము)2
(నీ స్తుతి పాత్రనై పాడెద)
చ:లోపములున్నను
నను ప్రేమించి
(లోకమునుండి నను వేరుపరచి)2
{లోబడుట నాకు నేర్పించితివి}2
లోతునకు నను నడిపించితివి.
[నీ ఆరాధనే నా ఆనందము
నీ సంకీర్తనే నా సంతోషము] 2
(నీ స్తుతి పాత్రనై పాడెద)
చ:{నీ చిత్తమునే జరిగించుటకు
నీ మహిమను నే వివరించుటకు}2
(నీ సన్నిదిలో నను నిలిపితివి)2
నీ సేవ చేసే ధన్యత నిచ్చితివి.,
(నీ ఆరాధనే)2
(నీ స్తుతి పాత్రనై పాడెద-నీ ఆరాధనే)

