Ni Padam Mrokkedan Nithyamu Stutinchi – నీ పాదం మ్రొక్కెదన్ నిత్యము స్తుతించి

Faith Score0
Faith Score0

Ni Padam Mrokkedan Nithyamu Stutinchi Telugu Christian Song lyrics – నీ పాదం మ్రొక్కెదన్ నిత్యము స్తుతించి

Ni Padam Mrokkedan Nithyamu Stutinchi Ninnu Padi Keerthinchedan
నీ పాదం మ్రొక్కెదన్ నిత్యము స్తుతించి
నిన్ను పాడి కీర్తించెదను
యేసయ్యా… నీ ప్రేమ పొంగుచున్నది (2)

పరిశుద్ధమైన పరవశమే
పరమ యేసు కృపా వరమే (2)
వెదకి నన్ను కనుగొంటివి (2)
పాడుటకు పాటనిచ్చితివి (2) ||నీ పాదం||

నూతన నూనె ప్రభావముతో
నూతన కవిత్వము కృపతోను (2)
నింపి నిత్యము నడిపితివి (2)
నూతన షాలేము చేర్చెదవు (2) ||నీ పాదం||

ఇరుకు నందు పిలచితివి
నాకు సహాయము చేసితివి (2)
చెడి ఎక్కడ తిరుగకుండ (2)
చేరవచ్చి నన్ను ఆదుకొంటివి (2) ||నీ పాదం||

నిత్యముగ నీ సన్నిధి
నాకు ఇచ్చును విశ్రాంతిని (2)
దుడ్డు కర్ర నీ దండమును (2)
నిజముగ నన్ను ఆదరించును (2) ||నీ పాదం||

ఫలించు చెట్టు నీవు నిలచు
తీగగా నేను వ్యాపించుటకై (2)
కొమ్మ నరికి కలుపు తీసి (2)
కాపాడి శుద్దీకరించితివి (2) ||నీ పాదం||

పరిశుద్ధమైన కీర్తితోను
ప్రకాశమైన శిఖరముపై (2)
శీఘ్రముగ చేర్చెదవు (2)
సీయోనులో నిన్ను కీర్తించెదన్ (2) ||నీ పాదం||

 

Estimated reading time: 2 minutes

Key Takeaways

  • The article presents lyrics for the Telugu Christian song ‘Ni Padam Mrokkedan Nithyamu Stutinchi – నీ పాదం మ్రొక్కెదన్ నిత్యము స్తుతించి’.
  • The song expresses themes of devotion, praise, and divine love towards Jesus.
  • It describes the personal relationship with Jesus, focusing on trust, support, and spiritual nourishment.
We will be happy to hear your thoughts

Leave a reply

About Us

Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
Logo