saaswatamainadi nee krupa maa yedala Lyrics – శాశ్వతమైనది నీ కృప మా యెడల

Faith Score0
Faith Score0

saaswatamainadi nee krupa maa yedala Telugu Christian Song Lyrics, Written and Sung by Sis. Glory Rani  & Bishop V. Rangaraju, Sankeerthana Grace, Michael Bright – శాశ్వతమైనది నీ కృప మా యెడల

శాశ్వతమైనది నీ కృప మా యెడల
నిన్న నేడు మారదు ఎన్నడూ విడువదు (2)

అను.ప : క్షణమైనా మరువలేదు – గొప్ప వాత్సల్యముతో మమ్ము [నన్ను]
సమకూర్చుచున్నావు నీవు – రెడంతల దీవెనలతో }2

1. కన్నీటితో విత్తుచు ఓపికతో ఎదురుచూచుచు
సహనముతో నీ కొరకు కనిపెట్టియుంటిని }2
మా కొరకు గొప్ప కార్యాలు ఎన్నో చేయుచు
మా నోటి నిండా నవ్వు నింపుచూ
సంతోషగానముతో పంటను కోయుచు
నీ కొరకు సాక్షిగా ఇలలో ఉందును

|| అను.ప : క్షణమైనా మరువలేదు ||

2. కృప చూపుటలో ఐశ్వర్యవంతుడా
కరుణించు దైవమా నీ దయను కోరగా }2
మా కొరకు వింత కార్యాలు జరిగించుచు
కొట్లుగానుగలు నిండి పొర్లించుచు
కోల్పోయినవన్నీ మరల సమకూర్చుచు
మము సిగ్గుపరచని మా దేవుడవు

|| అను.ప : క్షణమైనా మరువలేదు ||

3. నీ యందే మేము సంతోషింతుము
నీ రక్షణలో ప్రహర్షింతుము }2
మా మనవులన్నీ మన్నించుచు
మా ఆశలన్నీ సఫలపరచుచు
నీ దయ మాపై చూపించినా
మా తండ్రి నీకే స్తుతి స్తోత్రము

|| అను.ప : క్షణమైనా మరువలేదు ||

4. మా యడల నీ తలంపులు విస్తారమైనవి
నీ ఆలోచనలు ఎంతో ఉన్నతం }2
నీ వాక్యమును స్థిరపరచుచు
నీ ఆలోచనలు జరిగించుచు
వాగ్దానములన్నీ నెరవేర్చుచు
నిత్య నిబంధన చేసిన దైవమా

|| అను.ప : క్షణమైనా మరువలేదు ||

|| శాశ్వతమైనది నీ కృప ||

saaswatamainadi nee krupa maa yedala Lyrics in English

saaswatamainadi nee krupa maa yedala Song Lyrics, శాశ్వతమైనది నీ కృప మా యెడల Lyrics

Songwriter : Sis. Glory Rani

Key Takeaways

  • The article features the Telugu Christian song ‘saaswatamainadi nee krupa maa yedala’ written and sung by Sis. Glory Rani and Bishop V. Rangaraju.
  • The lyrics express themes of divine grace, hope, and faith, emphasizing God’s everlasting kindness.
  • Each verse highlights the singer’s devotion and reliance on God’s mercy and blessings.

Estimated reading time: 2 minutes

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo