Aradhinthunu Anandithunu Yesunilo – ఆరాధింతును ఆనందింతును
ఆరాధింతును ఆనందింతును యేసునిలో నే నెల్లవేళలా
ఆరాధింతును స్తుతియింతును యేసుని నేను ఎల్లవేళలా
నా హృదయాంతరంగములో వినిపించెను ప్రభు పాదధ్వని
తెరువబడెను నా మనో నేత్రము(2) గుర్తించితి నా ప్రాణ ప్రియుని
ప్రేమ ధ్వజమునెత్తె ప్రభు నాపై వీడను తరమా ప్రభుసన్నిధి
ప్రభు కౌగిలిలో పరవశమొంది(2) పాడెద ప్రభుకే స్తుతినిత్యము
కార్చెను రుధిరం ప్రభు తనువే తడిపెను నాదు ఉల్లమునే
తన ఎదలో నను దాచెను విభుడే (2) ప్రభునికే నేను అంకితము

