విడువడు నా యేసయ్య – Viduvadu naa yesayya
విడువడు నా యేసయ్య…
మరువాడు నా యేసయ్య… ||2||
నా దేవా,నా దేవా భయమెందుకన్నాడు
నా ప్రభువా , నా ప్రభువా దిగులెందుకన్నావు ||2||
1. నా అన్నవారే నన్నాదరించలేదే
నాతో ఉన్నవారే నాతోడు నిలువలేదే
ఏముంది నాలో వట్టి పాత్రుడనయ్యా
నన్ను గమనించి నాలో ఉన్నావు
నన్ను ప్రేమించి ఆదరించావు
నా దేవా,నా దేవా భయమెందుకన్నాడు
నా ప్రభువా , నా ప్రభువా దిగులెందుకన్నావు
అందుకే ఈ ఆరాధన
అందుకో నా స్తుతి అర్పణ
నా జీవితమంతా నీవేనయ్యా
ఈ జీవితమంతా నీకేనయ్యా
2. నా జీవనయత్రలో కృంగియున్న నన్ను
కష్టాల సంద్రంలో పడియున్న నన్ను
నీ చేతితో నన్ను పట్టిలేపావయ్య
నన్ను నడిపించి ధైర్యపరిచావు
నన్ను లేవనెత్తి గోప్పచేసావు
3. నా ఘోర పాపము నుండి రక్షించువారు లేరే
నా రోగ భాధలు చూచి ప్రేమించువారులేరే
నా తోడు ఉన్నవని చాటి చెప్పావయ్యా
నీ రక్తముతో రక్షించావు
నీ కృపతో నన్ను ప్రేమించావు

