యేసూ నీ కార్యములు ఎంతో గొప్పవి – Yesu Nee Karyamulu ento goppavi
యేసూ నీ కార్యములు ఎంతో గొప్పవి
తండ్రీ.. నీ తలంపులు లెక్కలేనివి ll 2 ll
అవి కంటికి కనబడవు
హృదయానికి అంతుచిక్కవు. ll 2 ll
కానా విందులో ఒకే మాటలతో – అద్భుతము చేసితివి
చేప కడుపులో ఆశ్చర్యముగా – యోనాను ఉంచితివి ll 2 ll
” అవి కంటికి కనబడవు ” ll యేసూ ll
షడ్రకు, మేషెకు, అబెద్నగోలతో – అగ్నిలో నిలచితివి
దానియేలును సింహపు గుహలో – విజయము నిచ్చితివి ll 2 ll
” అవి కంటికి కనబడవు” ll యేసూ ll
పౌలు సీలలు ప్రార్ధించగా – చెరసాల బ్రద్దలాయెనే
గొఱ్ఱెల కాపరి దావీదును – రాజుగ చేసితివి ll 2 ll
” అవి కంటికి కనబడవు” ll యేసూ ll


