జననం మరణం మధ్యన – Janannam Maranam
జననం మరణం మధ్యన ఉన్న జీవితకాలంలో
బంధు బలగం భాగ్యాలు కాసేపటి పయనంలో
మనం పోయే స్థితిలో ఎందరు నీతో ఉన్న
ఆపగలరా నీ మరణం నీ ఒంటరి పయనంలో
అయ్యో మానవ తెలుసుకో ఈ జీవిత సత్యాన్ని
నీ జీవిత సత్యాన్ని
బంగారు గిన్నెలో నేతి ముద్దలే నీవు తిన్నగాని
పట్టుపరపు పై ప్రతి దినం పరుండిన గాని
బందు బలగమే స్మశానానికి నీతో వచ్చిన గాని
మట్టి పరుపుపై గంధపు చెక్కతో కాల్చిన గాని
ఎవ్వరు రారు నీతో ఏ ఒక్కరు రారు నీతో
అయ్యో మానవ ఎందరు నాకు ఉన్నారని ఒంటరివయ్యావు
నీ దేహంలోనే ఆత్మ విలువనే నీవు మరచిపోయి
శరీర మాయలో మునిగితేలుతూ మోసపోతున్నావా
దైవ బంధమే ఆత్మబందమై
ప్రేమను పంచిన గాని
క్రీస్తు ప్రాణత్యాగమే నీకే చేసిన తెలుసుకో
ఆత్మయే జీవింపచేయును శరీరమే నిష్ప్రయోజనం
అయ్యో మానవ నీవు ఒక ఆత్మవు దేహాన్ని
వదిలి వెళతావు మరో లోకం



