Dhachivunchalenayya Telugu Christian Song Lyrics, written and sung by Bro. Prasad Nelapudi & Anand Palivela – దాచిఉంచలేనయ్య. TPF Singapore
దాచిఉంచలేనయ్య – నీఎదుట నాపాపములు
దాచిఉంచలేనయ్య – నీఎదుట నాదోషములు
మానక చేసిన పాపములెన్నో నను పాపిగ చేసినవి
మానక చేసిన దోషములెన్నో నను దోషిగా నిలిపినవి – (2)
అనుపల్లవి:
ఓప్పుకొంటిని విరిగిన మస్సుతో – (2)
నీ ప్రేమ చూపించి మన్నించుమా తండ్రీ – (2)
1.అంధకారమే నను ఆవరించగా
కన్నులు కానక నేతిరిగితిని
నాపాపదోషములే అడ్డుగోడై
నీకు దూరము చేసినవి – (2)
నాకు తలంపు పుట్టకమునుపే
నా అంతరంగము తెలిసిన దేవా (2) ||ఓప్పుకొంటిని||
2. ఎన్నో మారులు గద్దించినను
నీమాట వినక నాఇష్టమంటిని
విస్తారమైన నా అపరాధములు
నీకు దుఃఖము కలుగ చేసినవి – (2)
నా త్రోవలన్నియూ తెలిసేయున్నవి
నా నడక పడకను ఎరిగిన దేవా (2 ) ||ఓప్పుకొంటిని||
3. నా అతిక్రమములు తుడిచి వేసి
నన్ను బాగుగా కడుగుమయా
నీ సన్నిధి నుండి నను త్రోసివేయక
నీ శుద్డత్మాతో నింపుమయ్యా – (2)
ఇక నేను ఎన్నడు పాపమూ చేయక
మనసంతా నీ వాక్యమునే
నింపుకొందునయ్యా (2) ||ఓప్పుకొంటిని
Dhachivunchalenayya Song Lyrics in English
Dhachivunchalenayya Lyrics, దాచిఉంచలేనయ్య Lyrics
Published by World Telugu Christians – Telugu Christian Songs, News, Bible Verses & Devotionals.
Estimated reading time: 2 minutes
Key Takeaways
- The article features the lyrics of the Telugu Christian song ‘Dhachivunchalenayya’ written and sung by Bro. Prasad Nelapudi and Anand Palivela.
- The song discusses themes of sin, grace, and redemption through God’s love and forgiveness.
- The text includes both the original Telugu lyrics and a brief overview of its significance for Telugu Christians.


