Manasunna Manchi Deva Lyrics – మనసున్న మంచిదేవా

Faith Score+2
Faith Score+2

Manasunna Manchi Deva Telugu Christian Praise & Worship Song Lyrics, Written and Sung by AR Stevenson – మనసున్న మంచిదేవా

మనసున్న మంచిదేవా – నీ మనసును నాకిచ్చావా
మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా

అ.ప. : నా మది నీ కోవెలగా మలచుకోవయా
నా హృదిని రారాజుగా నిలిచిపోవయా

1. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము
దానిని గ్రహియించుట ఎవరి సాధ్యము
మనసు మర్మమెరిగిన మహనీయుడా
మనసు మార్చగలిగిన నిజదేవుడా

2. చంచల మనస్సాడించు బ్రతుకు ఆటను
వంచన చేసి నడుపును తప్పు బాటను
అంతరంగమును పరిశీలించు యేసయ్యా
స్థిరమనస్సుతో నీ దారిలో సాగనీవయ్యా

3. నిండు మనస్సుతో నిన్ను ఆశ్రయించితి
దీనమనస్సుతో నీకడ శిరము వంచితి
పూర్ణశాంతిగలవానిగా నన్ను మార్చుమా
తరతరములకు క్షేమము చేకూర్చుమా

Manasunna Manchi Deva Lyrics in English

Manasunna Manchi Deva Song Lyrics, మనసున్న మంచిదేవా Lyrics

MANASUNNA MANCHI DHEVAA

Published by World Telugu Christians – Telugu Christian Songs, News, Bible Verses & Devotionals.

Key Takeaways

  • The article presents the lyrics of the Telugu Christian song ‘Manasunna Manchi Deva’ by AR Stevenson.
  • The song expresses themes of devotion and transformation of the heart.
  • It includes various verses reflecting on the nature of the mind and seeking divine guidance.
  • The English translation of the song title is also provided.
  • Published by World Telugu Christians, it features Christian songs, news, and devotionals.

Estimated reading time: 2 minutes

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo