నీ చిత్తం నెరవేర్చు దేవా – Nee Chittam Nerravechu Deva
నీ చిత్తం నెరవేర్చు దేవా
నీ దాసుడను నేను కానా//2//
ఏ పాటివాడను నేను? – రక్షించి ప్రేమ చూపుటకు
ఏ పాటివాడును నేను?- గుర్తించి హెచ్చించుటకు..//2//
1.నీకు లోబడి వుండుట – పరలోక స్వాస్థ్యమే
భయముకలిగి జీవించుట – అపవాదికి లయమే..
విశ్వసము కలిగి వుండుట – సమస్తము సాధ్యమే
నిరీక్షణ తో జీవించుట – రక్షణానందమే
ఏ పాటివాడను నేను? – రక్షించి ప్రేమ చూపుటకు
ఏ పాటివాడును నేను?- గుర్తించి హెచ్చించుటకు..//2//
2.శ్రమను పొందుట ద్వారనే – సంపూర్ణులు అవుదురు.
సోదింపబడిన వారికిని – సహాయకుడు ఆయనే.
యదార్థముగా జీవించుట – సంరక్షణ నిచ్చును
నీకూ ప్రార్ధిచు వారిని – కరుణించేదవు…
ఏ పాటివాడను నేను? – రక్షించి ప్రేమ చూపుటకు
ఏ పాటివాడును నేను?- గుర్తించి హెచ్చించుటకు..//2/