Vaadabaarani Rajyamu nenu – వాడబారని రాజ్యము నేను
వాడబారని రాజ్యము నేను పొందుటకై నను పిలిచితివా
నీ పరిశుద్ధత కనుపరచుటకై నన్ను బ్రతికించి ఉంచితివా ||2||
ఆరాధన నీకే ఆరాధన యేసు ఆరాధన స్తుతి ఆరాధన ||2||
వేదనలోన శోధనలోన కుమిలియున్న నన్ను
నిందలలోన వ్యాధులలోన పలిగియున్న నన్ను ||2||
నీ కృప చేత నన్ను విడిపించి
సిలువ త్యాగము నీవు చేసితివి….
..ఆరాధన నీకే ఆరాధన…
వాక్యములోన సత్యములోన బ్రతుకుచున్న నన్ను
నూతనమైన తీర్మానముతో నడచుచున్న నన్ను ||2||
నీ ఆత్మచేత నన్ను నింపితివి
రాజ్యవారసుని నన్ను చేసితివి… ||2||
..ఆరాధన నీకే ఆరాధన…
దూతలతోను పెద్దలతోను పొగబడుచున్న దేవా
తేజోమహిమతో పరదేశములో వశియించుచున్న దేవా ||2||
ఆ స్వాస్యముకై నన్ను ఏర్పరచి,
ఆ ధ్యాసతో నన్ను నడిపితివి…. ||2||
..ఆరాధన నీకే ఆరాధన

