బలమైన యేసయ్యా – Balamaina Yesayya
ఆ… ఆ ఆ ఆ … ఆ ఆ ..
ఆ … ఆ ఆ ఆ ఆ ….. “2”
బలమైన యేసయ్యా – నా రూపం నీదేనయ్యా
నీవిచ్చినదియే తప్పా – యేముంది నాలో బలం
ఆరాధించెదను దేవా -నను నేను తగ్గించుకొనుచు
నరనరములలో నీ స్తుతియే ప్రవహించుచున్నది నదిలా
దిక్కులేని వాడను కాను
నీ సొంత బిడ్డలలో నేను కలను (బలమైన)
నీయందు భయభక్తితో ఆరాధన
నీ మీద ప్రేమతో ఆరాధన
ఆత్మలో లీనమై ఆరాధన
నీకే నా యేసయ్యా (బలమైన)
1.ఈ బ్రహ్మాండములో – అతి స్వల్ప జీవిని
నన్నుకూడా మరువలేదయ్యా “2”
నా చేయి పట్టుకున్నావు గనుకా
నేలను పడినా తిరిగి లేతున్
మేలు భాధ అన్ని నేనుండే
నాకు మేలు భాధ అన్ని నేనుండే (నీయందు)
2.అవిధేయుడను ఆశీర్వదించితివే
బ్రతుకంత నీ వెంట రాలేనా “2”
నా జీవితంలో ఒకసారి చూస్తే
నీవంటి ఉపకారి లేడు “2”
గర్వం గోప్ప అన్ని నీలోనే
నాకు గర్వం గోప్ప అన్ని నీలోనే (నీయందు)



